
తెలుగు ప్రేక్షకులకు.. ‘చెక్, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్సట్రా-ఆర్డినరీ మాన్, రాబిన్‌హుడ్, తమ్ముడు’.. ఈ సినిమాలు తెలిసే ఉంటాయి. కానీ, చూసుండరేమో!.. హీరో నితిన్ ఎపిక్ డిజాస్టర్స్ సినిమాలివే. వరుస ఫెయిల్యూర్స్తో నిర్మాతలకు భారీ నష్టాలూ తెచ్చిపెట్టిన నితిన్ సినిమాలు ఇవి. ఇటీవలే దిల్ రాజు నిర్మాణంలో తమ్ముడు మూవీతో వచ్చి నితిన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు.
సుమారు రూ.70కోట్లు ఖర్చు పెట్టి తీసిన తమ్ముడు, వరల్డ్ వైడ్గా కేవలం రూ. 6.02 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. దీంతో నితిన్ సినిమా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. అదేంటీ? నితిన్ స్టార్ హీరో, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తనయుడు అనుకుంటే పొరపాటే!.. సినిమా ఇండస్ట్రీలో పాత్రకు తగ్గట్టు నటించడమే కాకుండా, మంచి కథను ఎంచుకోవడం ఎంతో కీలకం. అలాంటిది నితిన్ వరుస ఫెయిల్యూర్స్కి ఎన్నో రకాల రీజన్స్ ఉన్నాయి.
ఇది అటుంచితే.. నితిన్ వాట్ నెక్స్ట్? అదేంటీ.. బలగం వేణుతో ‘ఎల్లమ్మ’మూవీ ఉంది కదా! అవును ఉంది. కానీ, ఎల్లమ్మ లో నితిన్ ఉండకపోవొచ్చని సినీ వర్గాల్లో కొత్తటాక్ మొదలైంది. నిన్నటివరకు ‘ఎల్లమ్మ’ కోసం నితిన్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. నితిన్‌కు లాభాల్లో షేర్ ఇవ్వాలని దిల్ రాజు డిసైడ్ అవ్వగా.. దీనికి నితిన్ కూడా ఓకే చెప్పినట్లు వినిపించింది.
ALSO READ : Sreeleela: ‘వైరల్ వయ్యారి’ వైరల్ అవ్వడానికి కారణం అతనే.. హీరోయిన్ శ్రీలీల కామెంట్స్
అయితే, లేటెస్ట్ టాక్ ప్రకారం.. భారీ బడ్జెట్తో ‘ఎల్లమ్మ’తెరకెక్కుతుంది. అందువల్ల మార్కెట్ లేని నితిన్పై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత దిల్ రాజు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా.. నితిన్తో సినిమా అవసరమా! అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు టాక్. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప మరింత క్లారిటీ తెలుస్తోంది.
ఇప్పటికే, ఎల్లమ్మ స్క్రిప్ట్ నుండి హీరో నాని తన బిజీ షెడ్యూల్స్ కారణంగా సైడ్ అయ్యాడు. ఇపుడు నితిన్ కూడా వెళితే.. ఎల్లమ్మ ఎవ్వర్నీ చేరనుందో! అనే ప్రశ్న మొదలైంది. అలాగే హీరోయిన్గా సహజనటి సాయి పల్లవి నటింస్తుందని కూడా వినిపించింది. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ నటించనుందని మరో టాక్ ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jai hanuman 🙏🙏#jaihanuman #yellamma #cinema #dreams #culture pic.twitter.com/xoVEK7XHw9
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 20, 2025