
కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘జూనియర్’.కన్నడ స్టార్ డా.రవిచంద్ర, జెనీలియా కీలకపాత్రలు పోషించారు. జులై 18న తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ముఖ్య అతిధిగా హాజరైన శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘కిరీటి నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ చూశాను. తను చాలా బాగా డాన్స్ చేశాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. కిరీటి రూపంలో మరో ప్రామిసింగ్ హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’అని అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ‘కిరీటి ఒక ప్యాషన్‌తో సినీ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తనకు చిన్నప్పట్నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేది. పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. మన ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది’అని అన్నారు. ఇది చాలా స్పెషల్ మూవీ అని, తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు కిరీటి.
ఈ సినిమా జర్నీ వండర్‌ఫుల్‌గా జరిగింది. కిరీటితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. డాన్స్ పెర్ఫార్మెన్స్‌లో ఒక వెపన్‌గా అనిపించారు. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడానికి కారణం దేవీశ్రీ ప్రసాద్ గారు. ఆయన ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. జూలై 18న ఈ సినిమా వస్తుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. " అని శ్రీలీల చెప్పింది.
ఇందులోని తండ్రీకొడుకుల ఎమోషన్ అందర్నీ ఆకట్టుకుంటుందని రవిచంద్రన్ అన్నారు. పదమూడేళ్ల తర్వాత ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని జెనీలియా చెప్పింది. టీమ్ అంతా పాల్గొన్నారు.