పెద్దాపురం సిల్క్ చీరలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ నేషన్... వన్ ప్రొడక్ట్ అవార్డ్

పెద్దాపురం సిల్క్ చీరలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ నేషన్... వన్ ప్రొడక్ట్  అవార్డ్

జాతీయస్థాయిలో పెద్దాపురం సిల్క్​ చీరల పేరు మరోసారి మార్మోగింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి.  చేనేత  విభాగంలో పెద్దాపురం సిల్క్​ చీరలు అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. 

వన్ నేషన్ వన్ ప్రొడక్ట్  విభాగంలో భాగంగా పెద్దాపురం సిల్క్​ చీరలు అవార్డును దక్కించుకున్నాయి.
జులై 14 సోమవారం ఢిల్లీలో జరిగిన  కార్యక్రమంలో  కాకినాడ జిల్లా క‌లెక్టర్ షణ్మోహన్ సగిలి ఈ అవార్డును అందుకున్నారు.  జాతీయ స్థాయిలో పెద్దాపురం సిల్క్​ చీరలు  ఎంపిక కావడం విశేషం.

పెద్దాపురంలో పట్టు పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు అయ్యే సిల్క్ ధోతులకు  ( పంచలకు) మంచి గుర్తింపు ఉంది. దీనిని వేష్టి, ముండు పంచ అని కూడా పిలుస్తారు. ఇది స్వచ్ఛమైన సిల్క్. కార్మికులు మల్బరీ సిల్క్ నూలు నువ్వు ఉపయోగించి చేనేత వస్త్రం పై నేస్తారు. ఈ ప్రాంతంలో అందమైన పట్టు చీరలను సైతం రూపొందిస్తారు. ఇప్పటికీ చాలామంది వివాహసంప్రదాయంలో ఉపయోగించే మధుపర్కాలను ఇక్కడినుంచే కొనుగోలు చేస్తారు.