మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసు: SIB ఏఎస్పీ కొడుకు అరెస్ట్

మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసు:  SIB ఏఎస్పీ కొడుకు అరెస్ట్

హైదరాబాద్  కోంపల్లి మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులు కీలక పురోగతి లభించింది.  డ్రగ్స్ కేసులో ఎస్ఐ బీ, ఏఎస్పీ వేణుగోపాల్ కొడుకు రాహుల్ తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. డిచ్ పల్లి డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.  రాహుల్ తేజ కోసం  పిటి వారెంట్ కూడా జారీ చేశారు డిచ్ పల్లి పోలీసులు. నిజామాబాద్ లో గతంలోనూ డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అయినా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై చర్చనీయాంశంగా మారింది.  

డ్రగ్స్ కేసులో  నిందితుల వాంగ్మూలం తీసుకున్నా  రాహుల్ ను అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో  రాహుల్ కు పోలీసులు సహకరించారనే అనుమానాలు ఉన్నాయి.   ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్   హైదరాబాద్ లోని పలు పబ్బులు, నగర శివార్లలోని ఫాంహౌజులకు సూర్య, హర్ష డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసులో మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను ‘ఈగల్ టీం’ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..   రెస్టారెంట్ నిర్వాహకులు నైజీరియా యువతి ద్వారా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్ సప్లై చేసేందుకు  మల్నాడ్ కిచెన్ యజమాని సూర్య నైజీరియా యువతులకు వెయ్యి నుంచి రూ.3వేలు కమిషన్  ఇస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మల్నాడు కిచెన్ నుంచి సిటీలోని పలు పబ్స్, హోటల్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. 

►ALSO READ | దిల్ సుఖ్ నగర్ కాల్పుల్లో.. తుపాకులు ఎక్కడివి.. చందు నాయక్ ను కాల్చినోళ్లు ఎవరు..? అసలు వివాదం ఏంటీ..?