Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’కు U/A సర్టిఫికెట్.. సెన్సార్ రివ్యూ ఎలా ఉందంటే?

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’కు U/A సర్టిఫికెట్.. సెన్సార్ రివ్యూ ఎలా ఉందంటే?

పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో AM రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. ఈ పీరియాడిక్ డ్రామా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీస్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హరి హర వీరమల్లు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

హరి హర వీరమల్లు సెన్సార్:

‘హరి హర వీరమల్లు- స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో రానుందని తెలిపారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, మిగతా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు.

బలమైన కథ, కథనాలకు తోడు గ్రాండ్ విజువల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని సెన్సార్ చెప్పినట్టు టాక్. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని సెన్సార్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్స్, కళ్లుచెదిరే విజువల్స్ ఆకట్టుకున్నాయని సెన్సార్ నుంచి టాక్.

ఈ క్రమంలో వీరమల్లుకి సెన్సార్ బృందం నుంచి ప్రశంసలు దక్కడంతో, ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్. ఇకపోతే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నాటి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటించగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.

రన్ టైంపై క్రిటిక్స్ టాక్: 

సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు మూడు గంటల రన్‌ టైమ్‌ ఉండేలా మేకర్స్ ప్లాన్‌ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలు తగ్గించారని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుందనేది సినీ ఫ్యాన్స్లో, క్రిటిక్స్లో టాక్‌ నెలకొంది.

ఇటీవలే, కుబేర సినిమా 3 గంటల 10 నిమిషాలు రన్ టైంతో వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని వసూళ్లు సాధించింది. కానీ, మూవీ రన్ టైం ఎక్కువైందనే టాక్ మరింత వచ్చింది. ఇంకాస్తా తగ్గించుంటే బెటర్ ఉండేదని సినీ క్రిటిక్స్ చర్చించుకున్నారు.

ఇక కన్నప్ప మూవీ సైతం  3 గంటల 10 నిమిషాలతో వచ్చి అదే టాక్ అందుకుంది. ఇపుడు వీరమల్లు టీమ్ జాగ్రత్తలు తీసుకుని.. మంచి అనువైన రన్ టైంతో వస్తుండటంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్:

హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూలై 20న) గ్రాండ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు విశాఖపట్నం సముద్రతీరాన్ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే, వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు డైరెక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సినీ వర్గాల టాక్.

U/A'సర్టిఫికేట్:

ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.