
- ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాలని ఎస్‌ఈసీ సూచన
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ప్రజల సందేహాల నివృత్తి, ఫిర్యాదుల స్వీకరణ తదితరాల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శనివారం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోన్ నెంబర్ 9240021456తో ఎస్‌ఈసీ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రజలకు ఉపయోగపడేలా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఈసీ కార్యదర్శి మకరందు తెలిపారు. ఎన్నికల నియమావళి, ఓటింగ్, అభ్యర్థుల సమాచారం తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొనడంతో పాటు తమ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకురావడానికి కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు.