ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు

V6 Velugu Posted on Feb 14, 2021

  • సహాయం అందుకున్న వారి వివరాలు బయటపెట్టొద్దన్న  ‘‘ఫీడ్ ద నీడి గ్రూప్’’
  • విద్యాబుద్ధులు నేర్పిన ప్రైవేటు పాఠశాల గురువులను పూర్వ విద్యార్థులే ఆదుకోవాలని పిలుపు

హైదరాబాద్: వారంతా మేధావులు. చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి సానబెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయడంలో వారికి వారే సాటి. అయితే తమ శ్రమకు తగ్గ వేతనాలకు నోచుకోని ప్రైవేటు స్కూల్ టీచర్లు. ప్రతిభకు తగ్గ గుర్తింపు.. గౌరవం లేకున్నా ఆత్మసంతృప్తి కోసం జీవిస్తున్న బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల్లో అనేకులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత చాలా మంది పస్తులుంటున్నారు. ఆత్మాభిమానం కలిగిన వీరంతా తమ కష్టాలు బయటకు చెప్పుకోకుండా… చేయి చాచి అడగలేక.. పస్తులు ఉంటూ.. పుకోక ఎవరికి తెలియకుండా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను గుట్టుగా పోషించుకుంటున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఆదుకోవాలని ‘‘ఫీడ్  ది నీడి’’ గ్రూప్ సభ్యులు పిలుపునిచ్చారు. అందరిలో స్ఫూర్తి కలుగజేసేందుకు మేము సైతం అంటూ 130 మంది ఉపాధ్యాయులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.  సమాజంలో స్థిర పడిన పూర్వ విద్యార్థులంతా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే గుర్తించి ఆదుకునేందుకు ముందుకు రావాలని గ్రూప్ సభ్యులు మీడియా ద్వారా కోరారు.

సహాయం అంటే ఇదీ.. ఆత్మాభిమానాన్ని గౌరవించారు

ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1994, 97 బ్యాచ్ దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు ఫీడ్ ద నీడి అనే పేరుతో  లాక్ డౌన్ సమయంలో అవసరం ఉన్న దాదాపు 21వేల మందికి రేషన్ కిట్లను అందజేశారు. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల సమస్యలు తెలుసుకున్న ఈ బృందం 2 సీజన్ పేరుతో  చిన్న ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్లకు, స్కూల్ సిబ్బందికి రేషన్ కిట్లను ఈ రోజు నుండి అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఓ ప్రైవేట్ పాఠశాలల టీచర్స్, స్కూల్ సిబ్బందికి రేషన్ కిట్లను అందించారు. తమ ద్వారా సహాయం పొందిన  ఉపాధ్యాయుల పేర్లు కానీ వారి పాఠశాల చిరునామాను రహస్యంగా ఉంచాలని మీడియాను కోరారు. దయనీయ స్థితిలో కష్టకాలంలో ఉన్న గురువులను వారి పూర్వ విద్యార్థులే ఆదుకోవాలని బండ్లగూడా తహసిల్దార్ ఫర్హీన్ షేక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడా తహసీల్దార్ ఫర్హీన్ షేక్, ఫీడ్ ది నీడి సభ్యులు సుధాకర్ రావు,వినోద్ గౌడ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

 

for more News..

ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం

ఒలింపిక్స్‌‌కు మరో ముగ్గురు ఇండియన్ రేస్‌‌ వాకర్స్‌‌

Tagged Appeal, teachers, starving, bandlaguda, alumni, farheen shaik, find the needy group, private school, srikanth, sudhakar rao, thahsildar, vinod gowd

Latest Videos

Subscribe Now

More News