కొత్త తరహా కథతో కాలింగ్ సహస్ర

కొత్త తరహా కథతో కాలింగ్ సహస్ర

సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ త‌‌‌‌యాల్‌‌, చిరంజీవి ప‌‌మిడి, వెంక‌‌టేశ్వర్లు కాటూరి నిర్మించారు. డిసెంబ‌‌ర్ 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జేడీ చక్రవర్తి, విరాజ్ అశ్విన్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకులు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్, ‘బలగం’ వేణు ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. సుధీర్ మాట్లాడుతూ ‘నటుడిగా నాలోని మరో కోణాన్ని చూపించే పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. కొత్త ప్రయత్నం చేశాం.

నచ్చితే పది మందికి చెప్పండి. ‘గాలోడు’ సినిమా ఫ్యాన్స్ వల్లే హిట్ అయింది. ఇకపై ఇలాంటి కొత్త తరహా కంటెంట్‌‌తో వస్తాను’ అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రావణుడిని చంపాకే రాముడు దేవుడయ్యాడు. సందర్భం వచ్చే వరకు ప్రతీ ఒక్కరూ సామాన్యులే’ అనే స్టోరీ లైన్‌‌తో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’ అన్నాడు. ‘మంచి కథతో ఈ సినిమా తీశాం. అవుట్‌‌పుట్ చాలా బాగా వచ్చింది’ అని నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.