4జీ, 5జీ టెక్నాలజీల్లో లోపం

4జీ, 5జీ టెక్నాలజీల్లో లోపం
  • కాల్స్, లొకేషన్ హ్యాకింగ్ కు చాన్స్

4జీ, 5జీ టెక్నాలజీల డేటా స్ట్రక్చర్‌ లో లోపాలున్నాయట. దీని వల్ల హ్యాకర్లు యూజర్ల మొబైల్స్ పై దాడి చేసే చాన్స్ ఉందని అమెరికాలోని పర్ డ్యూ, అయోవా యూనివర్సిటీ రీసెర్చర్లు వెల్లడించారు. 4జీ లేదా 5జీ టెక్నాలజీని వాడే ఏ మొబైల్ ఫోన్ లొకేషన్ నైనా హ్యాకర్లు ఇట్టే పట్టేయగలరని చెప్పారు. కాల్స్‌‌లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోగలరని తెలిపారు. 5జీ నెట్ వర్క్‌‌లో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుందని తొలుత రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. కానీ రీసెర్చర్లు దీనిలో మూడు లోపాలను గుర్తించారు.వాటితో సులువుగా హ్యాకిం గ్‌ కు పాల్ప డొచ్చని తేల్చారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న 4జీ టెక్నాలజీలో కూడా ఇవే లోపాలు ఉన్నట్లు గుర్తించారు. టార్పిడో, పీర్సర్స్ , ఐఎమ్ఎస్ఐ క్రాకింగ్ ఎటాక్స్ తోఈ నెట్‌‌వర్క్స్ లోకి చొరబడొచ్చని వెల్లడించారు.

టార్పిడో ఎటాక్…

ప్రైమరీ రూల్స్‌‌ను బ్రేక్ చేయడమే టార్పిడో ఎటాక్. దీని ద్వారా పేజింగ్ ప్రొటోకాల్స్‌‌ను అతిక్రమించి, నెట్‌ ‌వర్క్ లోకి ప్రవేశించొచ్చు.పేజింగ్ ప్రొటోకాల్ ఓ వ్యక్తి ఫోన్‌ కు వచ్చే కాల్స్, మెసేజ్‌ ల గురించి చెబుతుంది. ఓ సింగిల్ నోడ్ ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో కాల్స్ వెళ్తే, టార్గెట్ డివైజ్ కు తెలీకుండా ఆటోమేటిక్ గా పేజింగ్ ప్రొటోకాల్ పని చేసి కాల్స్ లేదా మెసేజ్ లు వెళ్తాయి. ఈ సమయంలో హ్యాకర్లు పేజింగ్ చానెల్ లో చొరబడే ఆస్కారం ఉంటుం ది. ఆ తర్వాత హ్యాకర్లు ఐపీ అడ్రస్ ను పట్టుకుని మరింత డేటాను దోచేసేందుకు కుదురుతుంది.

పీర్సర్స్, ఐఎమ్ఎస్ఐ క్రాకింగ్ ఎటాక్...

ఇది టార్పిడో ఎటాక్ కు కొనసాగింపు. ఈ ఎటాక్ ద్వారా హ్యాకర్లు 4జీ నెట్ వర్క్ లో యూజర్ ఐఎమ్ఎఐ(ఇంటర్నేషనల్ మొబైల్ సబ్ స్క్రైబర్ ఐడెంటి టీ) ని కనుక్కుంటారు. ఆ తర్వాత మెల్లగా పూర్తి స్థాయిలో ఐఎమ్ఎస్ఐను వాళ్ల అదుపులోకి తెచ్చుకుంటారు. 5జీ నెట్ వర్క్స్ లోనూ ఇలాగే దాడి చేస్తారు.