శ్యామ్ కె నాయుడుపై ‘అర్జున్ రెడ్డి’ నటి ఫిర్యాదు.. అరెస్ట్ చేసిన పోలీసులు

శ్యామ్ కె నాయుడుపై ‘అర్జున్ రెడ్డి’ నటి ఫిర్యాదు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడు, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనతో ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ, పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి మోసం చేశాడ‌ని సినీ నటి సాయి సుధ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన శ్యామ్.కె.నాయుడు పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సాయి సుధ ఆవేదన వ్యక్తం చేసింది

ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కె నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలకు శ్యామ్ కె నాయుడు కెమెరామెన్‌గా పని చేశారు. సాయి సుధ అర్జున్ రెడ్డి సినిమాతో పాటు ప‌లు సినిమాల్లో నటించింది.

cameraman shyam k naidu arrested by police in cheating case