ఈ రోజుల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా జిమ్లో వర్కవుట్ చేస్తున్నారు. హెవీ వర్కవుట్ చేస్తే ఏమైనా నష్టాలుంటాయా? అనే అనుమానాలు ఉంటాయి. కానీ, మీ శక్తి మేరకు వర్కవుట్స్ చేయొచ్చని అంటోంది ఫిట్ నెస్ ఫ్రీక్ దిశా పఠాని. తక్కువ బరువున్న వాటితో ఎక్కువ రెప్స్ చేయడం కంటే ఎక్కువ బరువు ఉన్న వాటితో తక్కువ రెప్స్ చేయడం మంచిది. ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. ఫ్యాట్ను తగ్గించడానికే కాదు మంచి ఆరోగ్యానికి కూడా వర్కవుట్ అవసరం. బలమైన వర్కవుట్స్ అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలో మార్పు గమనించవచ్చు. వర్కవుట్స్లోలో ఆమె ఫాలో అవుతున్న టెక్నిక్స్ ఇవేనంటోంది.
షోల్డర్ ప్రెస్: మజిల్స్ పెరగడానికి ఇది బెస్ట్ వర్కవుట్. కూర్చుని, నిల్చుని చేయొచ్చు. రెండు చేతుల్లోనూ డంబెల్స్ తీసుకోవాలి. చేతులను సమానంగా పైకి లేపుతూ చేసే ఈ ఎక్సర్సైజ్ కోర్ మజిల్స్ పై రిజల్ట్ చూపుతుంది.
మంచి వామప్ : ఏరోబిక్ ఎక్సర్సైజ్, వామప్ మంచి కాంబినేషన్స్. ఇది హార్ట్ బీట్ ను, బాడీ టెంపరేచరు కంట్రోల్ చేస్తుంది. అలాగే క్రంచెస్.. యాబ్స్ కోసం మంచి ఎక్సర్ సైజ్. మ్యాట్ పై పడుకుని మోకాళ్లను 90 డిగ్రీల్లో పైకెత్తి లోయర్ బ్యాక్ను మ్యాట్కు ఆనేలా చేయాలి. ఛాతికి తగులుతున్నట్లు నెమ్మదిగా పైకి లేస్తూ కంటిన్యూ చేయాలి.
ఫొటోలు దాచుకుని..
ఫిట్నెన్ వర్కవుట్ రెగ్యులర్గా చేస్తుండాలి. సెల్ఫ్ మోటివేషన్ తప్పకుండా ఉండాలి. అప్పుడే టార్గెట్ ను రీచ్ అవగలం. దాని కోసం మీ వర్కౌట్స్ ఫొటోలు, వీడియోలుగా తీసి దాచుకోవాలి. 'మాబ్స్' కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోల ద్వారా రికార్డ్ చేసుకోవాలి. వాటిని చూసుకుంటుంటే మీలో వచ్చే మార్పు తెలుస్తుంటాయి. అవి కాన్ఫిడెన్స్ ను కూడా పెంచుతాయి.
