గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా..? తింటే ఆరోగ్యానికి మంచిదా..? కాదా..?

గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా..? తింటే ఆరోగ్యానికి మంచిదా..? కాదా..?

గుడ్డు, పన్నీర్ రెండింట్లోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. మరి ఈ హెల్దీ ప్రొటీన్స్ ని ఒకేసారి తినొచ్చా? వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అసలు బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ కాంబినేషన్ని డైట్లో చేర్చొచ్చ? ఈ ప్రశ్నలకి సమాధానంగా ముంబైలోని వోక్హార్డ్ హాస్పిటల్ హెడ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అమీర్ షేక్ ఏం చెప్పారంటే..

బరువు తగ్గాలంటే  కేలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉన్న పుడిని డైట్ లో చేర్చాలి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు గుడ్లు, పన్నీర్ ఎక్కువగా తింటుంటారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. ఇవి తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్లు రిలీజ్ అయ్యి చాలాసేపటి వరకు ఏం తినాలనిపించదు కూడా. దాంతో సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే కొందరు పన్నీర్, గుడ్లు ఒకే మీల్ లో తింటుంటారు? మరి ఈ కాంబినేషన్ వెయిట్ లాస్ కి ప్లస్సా? మైనస్సా? అంటే ప్లస్ అనే అంటున్నారు ఈ న్యూట్రిషనిస్ట్,

ALSO READ : దసరా పండుగ స్పెషల్..స్వీట్ లవర్స్ కోసం..

గుడ్లు తింటే :
• ఒక కోడిగుడ్డులో 4.8 గ్రాములు ఫ్యాట్, విటమిన్-ఎ, క్యాల్షియం, జి విటమిన్-డీ, రిబోఫ్లెవిన్, విటమిన్ బి12, ఫొలేట్, విటమిన్- ఈ నియాసిన్, ఐరన్ ఉంటుంది. వీటన్నింటి వల్ల తేలిగ్గా బరువు తగ్గోచ్చు. 
• గుడ్లలోని సొలిటిటీ ఇండెక్స్ కడుపునిండినట్టు అనిపించడం వల్ల త్వరగా ఆకలి అవ్వుదు.
• గుడ్లు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి త్వరగా బరువు తగ్గుతారు. 
• కోడి గుడ్డులో శరీరానికి కావాల్సిన ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ఇవి శరీర బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి.

పన్నీర్ తింటే: వందగ్రాముల పన్నీర్ 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 72 కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకి దీన్ని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. పన్నీర్ లోని గుడ్ ఫ్యాట్స్ కూడా బరువు తగ్గడంలో కీ రోల్ పోషిస్తాయి. అదెలాగంటే.. గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం ఎనర్జీ కోసం దాన్ని ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. 
• పన్నీర్లో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్, బాడీ బిల్డింగ్ కి బెస్ట్ సప్లిమెంట్,
• వంద గ్రాముల పన్నీర్ 83 గ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. బాడీలో పేరుకున్న ఫ్యాట్ని కరిగించడానికి సాయం చేస్తుంది. అదెలాగంటే... క్యాల్షియం బాడీ టెంపరేచర్ థర్మోజెనెసిస్ పెంచుతుంది. దానివల్ల
మెటబాలిజం బూస్ట్ అయ్యి బరువు తగ్గొచ్చు.

లాభమే ఎక్కువ: పన్నీర్, కోడి గుడ్లని కలిపి తింటే లాభమే తప్పు నష్టం ఉండదు. ఈ రెండింట్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్ బి 12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దాంతో బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అలాగే ఇవి రెండూ పైన చెప్పినట్టుగా డైజెషన్ ట్రాక్ని స్లో చేసి బరువు తగ్గడానికి సాయపడతాయి. అయితే డైట్లో ఉన్నవాళ్లు పన్నీర్ టిక్కా, స్క్రామ్ బుల్డ్  పన్నీర్, పన్నీర్ 65 లాంటివి మాత్రమే తినాలి. పన్నీర్ బటర్ మసాలా లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి.. కోడిగుడ్లని కూడా వీలైనంతవరకు ఉడకబెట్టుకొని మాత్రమే తినాలి అంటున్నారు. దీంతోపాట బరువు తగ్గాలనుకునే వాళ్ళు గుడ్డు.. పన్నీర్ని విడి విడిగా తినడం వల్ల కలిగే లాభాల్ని కూడా చెప్పారు.