హ్యాండ్ గన్స్​పై కెనడా నిషేధం

హ్యాండ్ గన్స్​పై కెనడా నిషేధం

ఒట్టావా:  కెనడాలో  హ్యాండ్ గన్స్–అమ్మకాలు, కొనుగోలు, సరఫరాపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో తెలిపారు. కొత్త రూల్ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. కాల్పుల ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలను ఉద్దేశించి ట్రూడో మీడియాతో మాట్లాడారు. దేశంలో కాల్పుల ఘటనలను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కొత్త హ్యాండ్ గన్స్​ దిగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పారు. దేశంలో తుపాకీ హింస పెరుగుతోందని ట్రూడో అన్నారు. దీనిపై కెనడా పార్లమెంట్‌‌లో ట్రూడో ప్రభుత్వం మేలో సీ–21 బిల్లును కూడా ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఈ చట్టం అమల్లోకి రానుంది. అప్పటి దాకా ట్రూడో నిర్ణయం కొనసాగుతుంది. తుపాకులను నియంత్రించేందుకు గత 40 ఏళ్లుగా తీసుకున్న చర్యల్లో ఇదే పటిష్టమైన ప్రణాళిక అని ప్రధాని ఆఫీసు పేర్కొంది.