అంతర్జాతీయ క్రికెట్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) పేరు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) ఆరోపణలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన కెనడా క్రికెట్ (Canada Cricket) లో మరో భారీ అలజడి నెలకొంది. గతంలో ప్లేయర్స్ ఎంపిక కోసం సెలెక్టర్లను బెదిరించిన ఈ గ్యాంగ్.. ఈసారి ఏకంగా కొత్తగా ఎన్నికైన క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటిపైనే తుపాకులతో దాడికి దిగింది.
ఇటీవలే కెనడా క్రికెట్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అర్విందర్ ఖోసా (Arvinder Khosa) ఇంటిపై బుధవారం తెల్లవారుజామున 4:40 గంటలకు కొందరు దుండగులు కాల్పులకి తెగబడ్డారు. ఈ దాడిలో ఖోసా ఫ్యామిలీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ, ఇంటి గోడలు, కిటికీలపై బుల్లెట్ రంధ్రాలు పడ్డాయి. టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన అవినీతిపై ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది.. బోర్డు అధ్యక్షుడిని భయపెట్టి, తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి పెంచేందుకే బిష్ణోయ్ గ్యాంగ్ ఈ కాల్పులకు పాల్పడినట్లు టాక్. ప్రస్తుతం సర్నే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
భారత్, శ్రీలంక వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టు ఫిక్సింగ్ వ్యవహారం ఈ కాల్పులతో కొత్త టర్న్ తీసుకుంది. కెనడా కేంద్రంగా పని చేసే బిష్ణోయ్ నెట్‌వర్క్.. దిల్‌ప్రిత్ బజ్వా (Dilpreet Bajwa) ను కెప్టెన్ చేయాలని, జట్టులోని కొందరు కీలక ప్లేయర్స్ ని బెంచ్‌కే పరిమితం చేయాలని సెలెక్టర్లను గన్ పాయింట్‌లో బెదిరించినట్లు అంతర్జాతీయ మీడియా కోడైకూసింది. బజ్వా మాటకు ఎదురుచెప్పితే పరిణామాలు వేరే ఉంటాయని ఈ గ్యాంగ్ హెచ్చరించినట్లు తెలుస్తుంది.
►ALSO READ | SRH vs RCB మధ్య టఫ్ ఫైట్.. రేపు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే!
కెనడా క్రికెట్ బోర్డు అవినీతిపై వచ్చిన ఒక తాజా డాక్యుమెంటరీ సంచలన విషయాలని బయటపెట్టింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 174 రన్స్ టార్గెట్‌ను కాపాడుకోకుండా కెనడా ఓడిపోయిందని ఆధారాలు బహిర్గతం చేసింది. కెప్టెన్ బజ్వా ఒకే ఓవర్లో నో బాల్స్, వైడ్లతో కలిపి ఏకంగా 15 రన్స్ ఇవ్వడంతో, ఈ అనుమానాలకు దారితీసింది. దీనికి తోడు కోచ్ ఖుర్రమ్ చోహన్ ఫోన్ రికార్డింగ్ లీక్ కావడం కూడా కెనడా క్రికెట్ పతనాన్ని సూచిస్తుంది.
