కల్గరీ: కెనడా ఓపెన్‌లో ఇండియా స్టార్ ప్లేయర్ పీవీ సింధు సెమీస్‌లోనే ఓడగా, యంగ్‌స్టర్ లక్ష్యసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో నాలుగోసీడ్ సింధు 14–21, 15–21తో టాప్‌సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో కంగుతిన్నది. మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ 21–17, 21–14తో నాలుగోసీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై నెగ్గాడు. 44 నిమిషాల మ్యాచ్‌లో లక్ష్య సూపర్ ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో ఓ దశలో 10–11తో వెనకబడ్డా వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–11 లీడ్‌తో ఈజీగా నెగ్గాడు. రెండో గేమ్‌లో 4–4తో స్కోరు సమమైన తర్వాత ఇండియన్ ప్లేయర్‌కు ఎదురేలేకుండా పోయింది.
