ఉక్రెయిన్ కు కెనడా సాయం

ఉక్రెయిన్ కు కెనడా సాయం

ఉక్రెయిన్ దేశానికి కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలను సరఫరా చేస్తోంది. రష్యా సైనిక దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ దేశానికి మద్ధతుగా కెనడా దేశం యాంటీ ట్యాంక్ ఆయుధాలు, అప్ గ్రేట్ వెపన్స్ సామగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో  తెలిపారు.

రష్యా ముడి చమురు దిగుమతులను నిషేధించనున్నట్లు ట్రూడో  చెప్పారు. రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా ఉక్రెయిన్  చేస్తున్న యుద్ధానిక .. కెనడా మద్దతు ఇస్తుందని  ట్రూడో ఒట్టావాలో మీడియాతో చెప్పారు. అంతర్జాతీయ బ్యాంకు చెల్లింపుల కోసం స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను తొలగించడాన్ని సమర్ధించడంతో సహా పలు ఆంక్షలకు కెనడా మద్దతు ఇచ్చింది. కెనడా ఇప్పటికే ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలతోపాటు ఔషధాలను పంపింది. తాము ఉక్రెయిన్ దేశానికి 100 కార్ల గుస్టాఫ్ యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్స్, 2వేల రాకెట్లను పంపిస్తామని కెనడా రక్షణ శాఖ మంత్రి అనితా ఆనంద్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రాన్ని బీహార్‌ ముఠా ఆక్రమిస్తోంది