భారత్‌‌‌‌కు ప్రయాణాలపై కెనడా కీలక నిర్ణయం

భారత్‌‌‌‌కు ప్రయాణాలపై కెనడా కీలక నిర్ణయం

ఒట్టావా: భారత్‌‌లో కరోనా విజృంభిస్తుండటంతో మన దేశానికి ప్రయాణాలంటేనే విదేశాలు జంకుతున్నాయి. ఇప్పటికే ఇండియాకు ట్రావెలింగ్‌‌పై అమెరికా, యూకే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అత్యవసరమైతే తప్ప భారత్‌‌కు వెళ్లొద్దని తమ దేశ ప్రయాణికులకు యూఎస్ గవర్నమెంట్ సూచించింది. యూకే, భారత్‌ల మధ్య నడిచే ఫ్లైట్‌‌లపై వారం పాటు బ్యాన్ విధిస్తూ అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా కెనడా కూడా ఇండియాకు ప్రయాణాలపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో భారత్‌‌, పాకిస్థాన్‌కు తమ దేశం నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ విమానాలపై ట్రూడో ప్రభుత్వం బ్యాన్ వేసింది. శుక్రవారం ఉదయం 11.30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో వచ్చే 30 రోజుల వరకు ఇండియా, కెనడా మధ్య ప్యాసింజర్ విమాన సేవలు నిలిచిపోనున్నాయి. అయితే కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించకపోవడం గమనార్హం.