ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్ వాసులకు వాగు సమస్య వెంటాడుతోంది. దవాఖానకు, మండల కేంద్రానికి రావడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఆనారోగ్యానికి గురైనా, మండల కేంద్రానికి చేరుకోవాలన్నా ప్రాణాలను ఆర చేతిలో పెట్టుకుని వాగు దాటల్సి వస్తోంది. లక్మాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో భార్య, బిడ్డకు జ్వరం రాగా.. వాగు దాటితే గాని ట్రిట్మెంట్ అందని పరిస్థితి ఉండడంతో నడుము లోతు వాగు ప్రవాహానికి భార్యను వీపుపై మోసుకుంటూ ఒడ్డుకు చేర్చాడు. బిడ్డను భుజన ఎత్తుకుని వాగు దాటాడు. లక్మాపూర్ వాగుపై నిర్మిస్తున్న వంతెన ఏండ్ల సందీ అసంపూర్తిగా ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు.
