365 బ్రాంచ్ లతో కస్టమర్లకు కెనరా బ్యాంక్ సేవలు

 365 బ్రాంచ్ లతో కస్టమర్లకు కెనరా బ్యాంక్ సేవలు

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కెనరా బ్యాంక్ చేయూతనిస్తోందని కెనరా బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర సీజీఎం కేహెచ్ పట్నాయక్ అన్నారు. లక్డికాపుల్ లోని ఓ హోటల్ లో కెనరా బ్యాంక్ హైటెక్ అగ్రి ఫైనాన్స్ బ్రాంచ్ కస్టమర్ మీట్  ను నిర్వహించారు. 30 ఏళ్లుగా కెనరా బ్యాంక్ తో ఉన్న అనుబంధాన్ని కస్టమర్లు పంచుకొని... వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా  సీజీఎం కేహెచ్ పట్నాయక్  పౌల్ట్రీ రంగానికి చెందిన కస్టమర్లతో సమావేశమై ... కెనరా బ్యాంక్ అందిస్తున్న స్కీంలను వివరించారు. దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ గా తాము కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని సీజీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 365 బ్రాంచులతో... 88 వేల 300 కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు.

ఏ బ్యాంక్ లో లేని విధంగా 666 రోజుల ఫిక్స్ డిపాజిట్ స్కీంతో సీనియర్ సిటిజన్స్ కు 7.5 శాతం,  సాధారణ కస్టమర్లకు 7 శాతం అత్యధిక వడ్డీతో సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.