గౌరవెల్లి ప్రాజెక్టుపాత టెండర్లు రద్దు

గౌరవెల్లి ప్రాజెక్టుపాత టెండర్లు రద్దు
  •  కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌లోని ఎస్సారెస్పీ వరద కాలువ ఏడో ప్యాకేజీ పెండింగ్ పనుల పాత టెండర్లను సర్కార్ రద్దు చేసింది. ఎనిమిదేండ్లవుతున్నా పనులను పూర్తి చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పూర్తయి‌‌‌‌న పనుల దశలోనే పాత టెండర్‌‌‌‌ను ప్రీ క్లోజ్ చేసింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.431.30 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. 

అందుకు అనుగుణంగా కొత్తగా టెండర్లను పిలవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలువల నిర్మా ణం ద్వారా హుస్నాబాద్, స్టేషన్ ఘన్‌‌‌‌పూ ర్‌‌‌‌లలోని కరువు ప్రాంతాలలో 1,06,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిం చేందుకు గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లను వినియోగిం చుకోవాలని సర్కార్ నిర్ణయించింది.