రద్దైన సీట్లు కేటాయించాలి

రద్దైన సీట్లు కేటాయించాలి

తల్లిదండ్రులకు భారమవుతున్నామని... రద్దైన సీట్లు కేటాయించాలని... పీజీ మెడికల్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రద్దు చేసిన తమ మెడికల్ సీట్లను వెంటనే  రీ-ఆలోకేట్ చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా డైరెక్టర్ (డీఎంఈ) కార్యాలయం ఎదుట ఎంఎన్ఆర్, మహావీర్, టిఆర్ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC గైడ్ లైన్స్ ఇచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, కోర్టు 4 వారాల గడువు ఇచ్చిందని మెడికల్ విద్యార్థులు తెలిపారు.

ఇప్పటికే మూడు వారాల గడువు ముగిసిందని... మరో వారం రోజులే ఉందన్నారు. కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ పరిధిలోని ఈ మూడు మెడికల్ కాలేజీలకు సంబందించిన సీట్లు రద్దు కావడంతో...తాము రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుండి వచ్చిన మెడికల్ విద్యార్థులకు ఇక్కడ సీట్లను కేటాయించారని... కానీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు, ప్రిన్సిపాల్ సెక్రెటరీ లు స్పందించి... వెంటనే తమకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలనే వారు కోరారు.