
మాదాపూర్, వెలుగు: క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని ఓజీహెచ్ఎస్ ప్రెసిడెంట్, గైనకాలజిస్టు డాక్టర్ ఎల్.జయంతిరెడ్డి అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ లో గురువారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమె గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ఉచిత స్క్రీనింగ్ కూపన్ల కార్యక్రమం హర్షించదగ్గ విషయమన్నారు. అక్టోబర్ 31 వరకు హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో కూపన్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కన్సల్టేషన్, మామోగ్రామ్ (బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్), పాప్ స్మియర్(సర్వికల్ క్యాన్సర్ పరీక్ష), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి పరీక్షలు ఉచితంగా
చేయనున్నట్లు తెలిపారు.