టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం(డిసెంబర్ 23) లిబియా సైన్యాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ప్రవేట్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్-హద్దాద్ తో సహా 8మంది మృతిచెందారు. టర్కీ, లిబియా దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వస్తుండగాఫ్లైట్ ప్రమాదం జరిగింది. టర్కీ రాజాధాని అంకారా నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఫ్లైట్ కూలిపోయింది.
లిబియా సైన్యాధ్యక్షుడు మరణాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి అబ్దుల్-హమీద్ ద్బీబా ధృవీకరించారు. పశ్చిమ లిబియాలో అల్-హదాద్ అత్యున్నత సైనిక కమాండర్‌గా సేవలందిస్తున్నారు..లిబియా సైన్యాన్ని ఏకం చేయడానికి కొనసాగుతున్న, UN- మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించాడని అబ్దుల్ హమీద్ తెలిపారు.
అంకారాకు దక్షిణాన 70కిలోమీటర్ల దూరంలోని హేమనా ప్రాంతంలో లిబియా సైన్యాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఫాల్కన్ 50 బిజినెస్ జెట్ శిథిలాలు గుర్తించినట్లు టర్కీ అధికారులు తెలిపారు.
