రాహుల్ బర్త్ డే సందర్భంగా ..క్యాన్సర్ పేషెంట్కు జగ్గారెడ్డి చేయూత

రాహుల్ బర్త్ డే సందర్భంగా ..క్యాన్సర్ పేషెంట్కు జగ్గారెడ్డి చేయూత
  • 10 లక్షల ఆర్థిక సాయం అందజేత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన చిరుద్యోగి హరి కృష్ణ ప్రసాద్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసే స్తోమత ఆయనకు లేదు. దీంతో జగ్గారెడ్డి మానవతా దృక్పథ:లో ముందుకొచ్చి రాహుల్ బర్త్ డే సందర్భంగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.