రుచి చూసి చెప్పే ఉద్యోగం

రుచి చూసి చెప్పే ఉద్యోగం

మంచి ఉద్యోగంలో చేరి బాగా డబ్బులు సంపాధించాలని నిరుద్యోగులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మంచి భోజనంతో పాటు నిత్యావసరాలు తీర్చుకోవడానికే కదా. చేసే ఉద్యోగమే తిని…దాని రుచి ఎలా ఉందో చెప్పే ఉద్యోగం అయితే  ఎలా ఉంటుంది. టేస్టు ఎలా ఉంటుందో చెబితే మంచి సాలరీ కూడా వస్తుంది.
కెనడాకు చెందిన ప్ర‌ముఖ‌ క్యాండీల తయారీ కంపెనీ.. తాము తయారు చేసే ప్రాడక్ట్స్ ను రుచి చేసి చెప్పే ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండి ఫన్‌ హౌస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్‌ జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేది. గ‌డ‌వులోపే మీ దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

క్యాండి ఫన్‌ హౌస్ కంపెనీ తాము తయారు చేసే పదార్ధాలను రుచి చూసే ఉద్యోగులకు గంటకు దాదాపు రూ.‌ 1700 రూపాయలు(30 కెనడియన్‌ డాలర్లు) ఇస్తామని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఉద్యోగానికి ఎంపికైన వారు.. ఆ కంపెనీ తయారు చేసే 3,000 క్యాండీలు, చాక్లెట్లను రుచి చూసి ఎలా ఉన్నాయో చెబితే చాలు..ఉద్యోగంతో పాటు..మంచి సాలరీ మీ సొంతం.