
అమరావతి: గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్ నిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని రెండో రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో జగన్ అన్నారు. గంజాయి సాగు చేసే వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతామని సీఎం పేర్కొన్నారు. దీనిపై ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌లతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో రావాలన్నారు. మళ్లీ గంజాయి సాగులోకి రాకుండా జీవనోపాధి పరిష్కారాలు చూడాలని చెప్పారు.