ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరైన అలిస్సా హీలీ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. బుధవారం (జనవరి 13) హీలీ తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మార్చిలో టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్ తన కెరీర్ లో చివరిదని ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కెప్టెన్ తెలిపింది. ఈ టూర్ లో భాగంగా పెర్త్‌లో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తో పాటు ఒక టెస్ట్ మ్యాచ్ కు హీలీ చివరిసారిగా నాయకత్వం వహిస్తుంది. అయితే టీ20 సిరీస్ కు మాత్రం ఈ ఆసీస్ దిగ్గజం అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఆమె 2026 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆడదు. కాబట్టి టీ20 సిరీస్ ఆడినా పెద్ద ప్రయోజనం ఉండదు.
ALSO READ : కొత్త కుర్రాడు అరంగేట్రం..
రిటైర్మెంట్ తర్వాత హీలీ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. " ఆస్ట్రేలియా తరఫున ఇండియాతో జరగబోయే సిరీస్ నా చివరిది కావడం ఎమోషన్ తో కూడుకుంది. ఆస్ట్రేలియా తరఫున ఆడటం నాకు ఇప్పటికీ ఇష్టమే. కానీ నాలో పోటీతత్వం తగ్గిపోయింది. జట్టును ముందుకు నడిపించడంలో నేను వెనకబడ్డాను. నా రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం నేను టీ20 ప్రపంచ కప్ ఆడను. ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్ ఆడడం లేదు. చివరిసారిగా ఇండియాతో వన్డే, టెస్ట్ సిరీస్ కు కెప్టెన్ గా అవకాశం వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను". అని హీలీ చెప్పుకొచ్చింది.
ALSO READ : చిన్నప్పటి ఫోటో దించేశాడు
దశాబ్దానికి పైగా హీలీ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ ఆసీస్ కెప్టెన్ ఓవరాల్ గా ఎనిమిది వరల్డ్ కప్ టైటిల్స్ గెలవడం విశేషం. వీటిలో ఆరు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలతో పాటు రెండు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ ఉన్నాయి. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో ఓడిపోవడం హీలీని తీవ్రంగా బాధించింది. ఆస్ట్రేలియా తరపున 10 టెస్ట్ ల్లో 30.56 సగటుతో 489 పరుగులు.. 123 వన్డేల్లో 35.98 యావరేజ్ తో 3563 పరుగులు.. 162 టీ20ఐ మ్యాచ్‌లలో ఒక సెంచరీతో 25.45 సగటుతో 3054 పరుగులు చేసి ఆస్ట్రేలియా క్రికెట్ ;లో దిగ్గజ క్రికెటర్ గా నిలిచింది.
ALSO READ : RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
Alyssa Healy is set to retire from all cricket at the end of the summer: https://t.co/4j3HV50o2m pic.twitter.com/fwNF8S40ET
— cricket.com.au (@cricketcomau) January 12, 2026
