ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2026లో బెంగళూరు జట్టు తమ హోమ్ మ్యాచ్ లను చిన్నస్వామి స్టేడియంలో ఆడడానికి వీలు లేకుండా పోయింది. బెంగళూరులోని ఐకానిక్ ఎం. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్య హక్కులను కోల్పోయింది. అధికారిక ప్రకటన రాకపోయినా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరగకపోవడం దాదాపుగా ఖారారైంది. 2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. రాయలేఛాలెంజర్స్ బెంగళూరు 2025 సీజన్ లో తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజయోత్సవ వేడుకలు జరిగాయి.
ALSO READ : 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌పై టీ20 మ్యాచ్‌లో శ్రీలంక విక్టరీ
ఆర్సీబీకి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. 32000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఇకపై క్రికెట్ ఆడే సూచనలు కనిపించడం లేదు. ఇందులో భాగంగా RCB ఆడబోయే 2026 ఐపీఎల్ మ్యాచ్ లకు కొత్త వేదికలను సెట్ చేసినట్టు సమాచారం. వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హోమ్ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహీన్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడనున్నట్లు సమాచారం.
ALSO READ : ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నీకి సింధు, లక్ష్యసేన్ రెడీ
2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలవడంతో 2025, జూన్ 4న బెంగుళూర్లోని చినస్వామి స్టేడియం వద్ద విక్టరీ పరేడ్, ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడే అవకాశం లేకుండా పోయింది. రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్ లను పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన తర్వాత ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ గత సంవత్సరం రాజస్థాన్ ఈ వేదికలో తమ మ్యాచ్‌లను ఆడదని సూచించాడు.
