గంజాయి వీడ్‌ అయిల్‌ పట్టివేత.. హ్యాండ్ బ్యాగులో గంజాయి

గంజాయి వీడ్‌ అయిల్‌ పట్టివేత.. హ్యాండ్ బ్యాగులో గంజాయి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మత్తు రావడానికి సిగరెట్లపై రాసుకునే గంజాయి వీడ్‌ అయిల్‌ను శుక్రవారం హైదరాబాద్‌ ఎన్​ఫోర్స్​మెంట్​సీఐ చంద్రశేఖర్‌ గౌడ్‌ అధ్వర్యంలో పట్టుకున్నారు. 91 గ్రాముల అయిల్‌తో పాటు రెండు బైకులు, రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ విలువ రూ.2 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో పక్కా సమాచారంతో ఈ గంజాయి అయిల్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో కూకట్‌పల్లికి చెందిన రాజు, ముషీరాబాద్‌కు చెందిన ఎండీ సోయాబ్‌ను అరెస్టు చేశారు. కళ్యాణ్‌ బాను, షేక్‌ ఇమ్రాన్‌ పరారీలో ఉన్నారు. సీఐ చంద్రశేఖర్‌ గౌడ్‌ తో పాటు ఎస్సై శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లిఖార్జున్‌రెడ్డి, కరణ్‌ ఇతర సిబ్బంది ఉన్నారు.

హ్యాండ్ బ్యాగులో గంజాయి
వికారాబాద్​ :  హ్యాండ్ బ్యాగులో గంజాయి పెట్టుకున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. తాండూరు టౌన్​ పోలీస్టేషన్ లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ సంతోష్ కుమార్  వివరాలను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లాల్​ మహమ్మద్​ తాండూరు రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగును తనిఖీ చేయగా 1.2 కిలోల ఎండు గంజాయి లభించింది. రిమాండ్​కు తరలించారు.