హైదరాబాద్ సిటీలో రూ.5 కోట్ల గంజాయి పట్టివేత : ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!

హైదరాబాద్ సిటీలో రూ.5 కోట్ల గంజాయి పట్టివేత : ఈగల్ టీం దెబ్బ మామూలుగా లేదుగా..!

డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీమ్. హైదరాబాద్ లో ఎక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా మెరుపు దాడి చేసి పట్టుకుంటోంది. అందులో భాగంగా జులై 28న  హైదరాబాద్ లో  భారీగా గంజాయి పట్టుకుంది. రూ.5 కోట్ల  విలువైన 935 కిలోల గంజాయిని పట్టుకుంది.  బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో పట్టుకుంది ఈగల్ టీమ్.  

ఒడిశా నుంచి  మహారాష్ట్ర కు డీసీఎంలో తరలిస్తుండగా బాట సింగారం ఫ్రూట్ మార్కెట్  దగ్గర పట్టుకున్నారు పోలీసులు. 35 సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసింది టీం. ముఠా సారధి పవార్ కుమార్ , సమాధాన్ భిస్, వినాయక్ పవార్ లను  అరెస్ట్  చేశారు పోలీసులు. సప్లయర్స్ సచిన్ గంగారాం చౌచౌహాన్, విక్కీ సేథ్ లు పరారిలో ఉన్నట్లు చెప్పారు. 

ALSO READ : పేదలకు గుడ్ న్యూస్: ఇళ్లకే వచ్చి రేషన్ కార్డులిస్తరు

ఇటీవల హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది. పబ్బుల్లోనూ,రేవ్ పార్టీల్లోనూ  డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కట్టడిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడిక్కడ దాడులు చేస్తోంది. 

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ‘ఈగల్’గా పేరు మార్చింది ప్రభుత్వం.  గ్రద్ద ఎలాగైతే పైనుంచి చూసి టార్గెట్ మిస్సవ్వకుండా ఎటాక్ చేస్తుందో అదే మాదిరిగా ఈగల్.. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మే వారిపై టార్గెట్ చేసి కట్టడి చేస్తుందన్న మాట.  ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్ మెంట్( Eagle -  Elite Action Group for Drug Law Enforcement  ) అని అర్థం.