కరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక..  గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య

కరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక..  గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స చేయించుకుంటుండగా.. ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్ తో చనిపోయాడు. దీంతో దూరపు బంధువులు.. దగ్గరి బంధువులు.. కనీసం ఇరుగు పొరుగు వారు కూడా పలుకరించకుండా అందరూ మొహం చాటేశారు. దీంతో మనస్తాపానికి గురైన నరసయ్య భార్య పరిమి సునీత (50), తన ఇద్దరు పిల్లలతో కలసి అఘాయిత్యానికి పాల్పడింది. కుమారుడు పరిమి ఫణికుమార్ (25), కుమార్తె పరిమి లక్ష్మి అపర్ణ ముగ్గురు కలసి ఇవాళ ఉదయం కొవ్వూరులో గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చారు. దారినపొయే వారు చూస్తుండగానే.. రెయిలింగ్ ఎక్కి దూకేశారు. వరద భారీగా ఉండడంతో మత్స్యకారులను అప్రమత్తం చేసినా.. ప్రయోజనం లేకపోయింది. వారు గోదావరిలో ఆచూకీ లేకుండా పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు.