
- గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన రేట్లు
- ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ఈ- కామర్స్ సంస్థలు
- సీటీసీలోని సర్వీస్ సెంటర్లకు తగ్గని కస్టమర్ల రద్దీ
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్క్లాసులు, వర్క్ ఫ్రంహోమ్లతో కంప్యూటర్, ల్యాప్ టాప్ లకు గతంలో లేనంత డిమాండ్ పెరిగింది. పోయిన ఏడాదితో చూస్తే ఈసారి రేట్లు భారీగా పెరిగాయి. సికింద్రాబాద్ లోని సీటీసీ( చెన్నై ట్రేడ్‌సెంటర్) కంప్యూటర్ల అమ్మకానికే ఫేమస్. రాష్ట్రం మొత్తానికి దాదాపు ఇక్కడి నుంచే కంప్యూటర్లు, స్పేర్ పార్ట్స్ సప్లయ్ అవుతుండగా, మార్కెట్ డిమాండ్‌ను బట్టి రేట్లు వారానికోసారి డిసైడ్ చేస్తుంటారు. 2020లో ల్యాప్టాప్రూ.28 వేలకే వస్తే, ఇప్పుడు రూ.35వేలకు చేరింది. పర్సనల్ కంప్యూటర్( అసెంబుల్డ్) రూ.26 వేలకు దొరికితే ప్రస్తుతం రూ.33 వేల నుంచి రూ.36వేల పైనే పెట్టాల్సి ఉంది. కీ బోర్డులు, కేబుల్స్, మౌస్, మదర్బోర్డ్, ర్యామ్‌లతో పాటు అన్ని స్పేర్ పార్ట్స్రేట్లు భారీగా పెరిగాయి. కొన్ని కంపెనీలకు చెందిన మదర్ బోర్డు గతంలో 7500 ఉండగా.. ప్రస్తుతం రూ.12 వేలకు, 1 టీబీ హార్డ్ డిస్క్ ధర గతేడాది 2,500 ఉంటే.. ఈసారి 3,500కు చేరిందని దీంతో సిస్టమ్ రేట్లు పెరిగాయని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. మరోవైపు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో రేట్లు జంప్ అవుతున్నాయని చెప్తున్నాయి. మరోవైపు ఆన్ లైన్ ఆఫర్లతో ఈ– కామర్స్ సంస్థలుఅదరగొడ్తున్నా.. సీటీసీ కస్టమర్లతో రద్దీగా ఉంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు,మీటింగ్ ల కోసం చాలామంది ఏడాదిన్నర కాలంగా కంటిన్యూగా కంప్యూటర్లను వాడు తుండటంతో టెక్నికల్ ఇష్యూస్ పెరిగాయి. దీంతో రిపేర్ కోసం సర్వీస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో..
బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్, ట్యాబ్, పీసీల ధరలు దాదాపు డబుల్ అయ్యాయి. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన పర్సనల్ కంప్యూటర్లు గతేడాది రూ33 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.42 వేల మధ్యలో ఉంది. గతంలో ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్, గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ఎక్కువగా సిస్టమ్స్ వాడేవారు. కరోనాతో కంపెనీలు తమ ఎంప్లాయీస్‌కు ఏకంగా ల్యాప్టాప్స్ఇచ్చి వర్క్‌ఫ్రం హోంకు సపోర్టు చేశాయి. మరోవైపు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ స్టూడెంట్స్ కు ఆన్లైన్క్లాసులు స్టార్ట్ చేయడంతో పీసీలు, ల్యాప్ ట్యాప్అమ్మకాలు పెరిగాయి. అన్నివర్గాలకు కంప్యూటర్ ఇప్పుడు ఓ అవసరంగా మారింది. అడ్వాన్స్ టెక్నాలజీ సిస్టమ్స్మార్కెట్లోకి వస్తున్నాయి. హ్యాంగ్ కాకుండా న్యూ జనరేషన్ వెర్షన్ లు కూడా ఉంటున్నాయి. కొత్త సాఫ్ట్వేర్స్వస్తుండగా వీటి వాడకం ఈజీ అయ్యింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు పలు రకాల ఫీచర్స్అందుబాటులోకి తెస్తున్నాయి. ధరలు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి. పేరున్న కంపెనీల ల్యాప్టాప్ధర రూ. 45 వేల నుంచి రూ. 1లక్ష దాకా ఉంది. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్, సిస్టమ్స్,స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా పెరిగాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ మినిమం రూ.15 వేల నుంచి రూ.20 వేలు, పీసీ రూ.18 వేలకు వస్తోందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
రిపేర్లకు వారానికి పైగా టైమ్
ల్యాప్‌టాప్, ట్యాబ్, పీసీలకు రిపేర్ కోసం చాలామంది సీటీసీకే వస్తుంటారు, అప్డేట్చేయకపోవడం, చిన్నపాటి మిస్టేక్స్తో కంప్యూటర్లు హ్యాంగ్ అవుతుంటాయి. ఒక్కోసారి డేటా మొత్తం పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కస్టమర్లు ల్యాప్ టాబ్, పీసీలను రిపేర్ కోసం సీటీసీలోని సర్వీస్ సెంటర్లకు తీసుకొస్తారు. గతంలో ల్యాప్ టాప్, సిస్టమ్ కు సంబంధించి ప్రాబ్లమ్ ను వెంటనే గుర్తించి రిపేర్ చేసేవారు. ప్రస్తుతం రిపేర్ కు కావాల్సిన మెటీరియల్ కొరత ఉండటంతో సర్వీస్ సెంటర్లలో వారం టైమ్ పడుతోంది. బ్యాటరీలు, ర్యామ్, స్కీన్స్, మౌస్ లు అందుబాటులో ఉన్నా..ఇతర స్పేర్ పార్ట్స్ కు సంబంధించి మెటీరియల్ లేకపోవడంతో రిపేర్ కు టైమ్ పడుతోందని సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. స్పేర్ పార్ట్స్ దిగుమతుల ప్రభావం, ల్యాప్ టాప్, పీసీలకు ఎక్కువ సార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ఆన్లైన్ మార్కెట్‌తో సీటీసీపై ఎఫెక్ట్
ఆన్ లైన్ మార్కెట్ ఎఫెక్ట్ సీటీసీ వ్యాపారులపై పడుతోంది. సీటీసీ వ్యాపారులు నష్టపోతున్నరు. పండుగలు, వీక్లీ సేల్స్ పేరుతో ఆఫర్లు న్యూ వెర్షన్ ల్యాప్టాప్స్, ట్యాబ్స్ కు ఆఫర్లు ఇస్తున్నరు. ఆఫ్ లైన్ మార్కెట్ తో పోలిస్తే ఆన్ లైన్ రేటులో భారీ తేడా ఉంటోంది. ఆన్లైన్లోనే తక్కువకు వస్తున్నాయని కొందరు కస్టమర్లు ఇక్కడ కొనడం లేదు. లోన్ఫెసిలిటీతో కూడా చాలా వరకు సీటీసీ మార్కెట్ డౌన్ అవుతోంది. సర్వీస్ సెంటర్లకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంటోంది. -గోపాల్, దేవిశ్రీ కంప్యూటర్స్, సీటీసీ, సికింద్రాబాద్