పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై కారు బోల్తా

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై కారు బోల్తా

గండిపేట, వెలుగు: కారు బోల్తా పడిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం శంషాబాద్ ఎయిర్​పోర్టుకు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై వెళ్తున్న ఓ కారు శివరాంపల్లిలోని పిల్లర్ నం.298 వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ ప్రెస్ వేపై కారు బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును పక్కకు తీసి ట్రాఫిక్​కు క్లియర్ చేశారు.