ఔటర్ పై కారు బీభత్సం..8 మందికి గాయాలు

ఔటర్ పై కారు బీభత్సం..8 మందికి గాయాలు

రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కొత్వాల్ గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపుతప్పిన కారు ఎదురెదురుగా వస్తున్న మరో కారుపై పల్టీ కొట్టింది. కార్లు బలంగా ఢీకొనడంతో.. 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలుకాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వాహనదారులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వీరిని వెంటనే అంబులెన్సులో హస్పిటల్ కు  తరలించారు. వీరిని హస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నిజాంపేట్ నుండి శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ వైపు వెళ్తున్న కారుపై మరోకారు వేగంగా వచ్చి పడింది. అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టి అటుగా వస్తున్న కారుపై దూసుకెళ్లిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారన్నారు పోలీసులు.