కారులో మంటలు..వ్యక్తి మృతి

కారులో మంటలు..వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్  ORR పై కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మేడ్చల్ నుంచి పఠాన్ చెరు వైపు వెళ్తుండగా కారు తగలబడిపోయింది. సంఘటన స్థలానికి చేరుకుని  ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలార్పారు. కారు గంటా శ్రీదేవి అనే మహిళ పేరుపై రిజిష్ట్రేషన్ అయి ఉందంటున్నారు పోలీసులు. డెడ్ బాడీని పఠాన్ చెరులోని ప్రభుత్వాస్పత్రి  మార్చురీకి తరలించారు.