 
                                    హైదరాబాద్: కారు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన సోమవారం శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తున్న బెలినో కారు కోత్వాల్ గుడా వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

 
         
                     
                     
                    