
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట కారుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగలేదు. గాయాలతో డ్రైవర్ తప్పించుకున్నాడు.
పెద్దమ్మ టెంపుల్ 15వ మెట్రో రైల్ పిల్లర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి ఒంటిగంట సమయంలో… ఆ రోడ్డుపై వస్తున్న కారు మూడు పల్టీలు కొట్టింది. కారు అద్దాలతో పాటు… రెండు పక్కల డోర్లు ధ్వంసమయ్యాయి. కారులో డ్రైవర్ తప్ప ప్రయాణికులు లేరని పోలీసులు చెప్పారు. డ్రైవర్ కొద్దిపాటి గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్నాడని తెలిసింది.
కారు వేగంగా వెళ్తున్నప్పుడు ముందు టైర్ పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.