
హైదరాబాద్ లో యవత రెచ్చిపోతోంది. కార్లతో బయటకు వచ్చి రోడ్లపై రచ్చ రచ్చ చేస్తున్నారు. యువకులు గ్రూప్ గా కార్లలో ఎక్కి కేరింతలు పెడుతూ.. అతివేగంతో వెళ్తూ కట్లు కొట్టడం, స్టంట్స్ చేయడం ఈ మధ్య ఎక్కువయ్యింది. ఆదివారం (ఆగస్టు 24) జంబారాహిల్స్ లో కారు చేసిన బీభత్సం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
ఉదయం కేబీఆర్ పార్కు దగ్గర కారు అతివేగంతో వచ్చి ఫుట్ పాత్ ఎక్కింది. అదే వేగంతో వెళ్లి పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టడంతో గోడ ధ్వంసంమైంది. ఐదురుగు యువకులతో ఉన్న కారు అతివేగంగా కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ప్రహరీ గోడ కూలిపోగా.. కారుకు డ్యామేజ్ జరిగింది.
కారులోని ఐదుగురు యువకుల్ని పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్కు దగ్గరలో ఒకవైపు మారథాన్ జరుగుతుండగా.. కారు బీభత్సం సృష్టించడం ఆందోళనకు గురి చేసింది. దీంతో కారు నడిపి యువకుడితో పాటు మిగతా నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.