
హైదరాబాద్, ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ….కారు బీభత్సం సృష్టించింది. ఒక షాప్ లోకి దూసికెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపింది మైనర్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి సంబంధించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.