
ఎల్బీ నగర్ హస్తీనాపురం దగ్గర అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. సాగర్ రింగ్ రోడ్డు నుంచి BN రెడ్డి నగర్ వైపు వెళ్తన్న కారు.. డివైడర్ ని ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న బైక్ తోపాటు, మరో కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.