 
                                    హైదరాబాద్: మాదాపూర్ పీఎస్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ లో శనివారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న యువతి,యువకుడు అతివేగంగా వెళ్లి డివైడర్ ను ఢీ కొట్టడంతో కార్ లో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కార్ నడుపుతున్న యువకుడు అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. మృతి చెందిన యువతి గుంటూరు జిల్లా కు చెందిన వినీతగా గుర్తించారు. ఆ యువతి బాచుపల్లి లోని హాస్టల్ లో ఉంటూ గీతం యూనివర్సిటీ లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో మద్యం బాటిళ్లు ఉండటంతో మద్యం మత్తు లో కార్ నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 
         
                     
                     
                    