
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ హైవేపై చింతపల్లి మండలం ధైర్యపురి తండా దగ్గర కారు అదుపు తప్పి వాటర్ పైపులైన్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దాంతో కారులోని ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. వీరంతా హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు కారులో నుంచి మృతదేహాలను బయటకి తీశారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
For More News..