
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రైస్ హైవే పై కారు బోల్తా పడింది. శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై వెళ్తుండగా రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 170 దగ్గర షిప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ హర్ష అగర్వాల్ కి తీవ్ర గాయాలు కాగా అతడిని సమీప హాస్పిటల్ కి తరలించారు. కరోనా కారణంగా శంషాబాద్ కు వెళ్లే ట్రాఫిక్ తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్రేన్ సాయంతో కారును పక్కకు తీశారు రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిబ్బంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజేంద్రనగర్ పోలీసులు.