
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫాం వద్ద XUV500 మహీంద్రా కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. మితిమీరిన వేగంతో రాజేంద్రనగర్ వైపు వెళుతున్న కారు డివైడర్ను ఢీకొనడంతో మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. సమయానికి కారులో ఉన్న హెయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ప్రాణహాని తప్పింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని వారు చెబుతున్నారు. డైరీ ఫాం నుండి రాజేంద్రనగర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.