కార్లలో బ్రీత్ ఎనలైజర్.. ఊదితేనే స్టార్ట్ అవుతుంది

కార్లలో బ్రీత్ ఎనలైజర్.. ఊదితేనే స్టార్ట్ అవుతుంది

డ్రంక్ అండ్ డ్రైవ్ ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోకుండా తాగి డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టేందుకు ఐరోపా కూటమి సరికొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది. 2022 సంవత్సరం నుంచి యూరప్‌లో తయారయ్యే అన్ని కార్లలో బ్రెతలైజర్స్‌‌ను అమర్చాలని నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబందించిన చట్టాన్ని ఎప్పుడో రూపొందించినప్పటికీ ఐరోపా మండలి గత వారమే గ్రీన్ సిగ్నలిచ్చింది. 2024 నుంచి అన్ని కార్లలో బ్రెతలైజర్స్‌‌ను తప్పనిసరి చేయనుంది. డ్రైవర్‌ ఇంజన్‌ను స్టార్ట్‌ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్‌ స్టార్ట్‌ అవుతుంది. ఒక వేళ డ్రైవర్ మోతాదుకుమించి మందు కొట్టినా.. సరిగ్గా ఊదకపొయినా కారు ఇంజిన్ స్టార్ట్ కాదు. కారు స్టార్ట్‌ అయిన తర్వాత దారి మధ్యలో  లిక్కర్ లీసుకోకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్‌లో ఊదాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఆల్కహాల్ తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. టెక్నికల్ గా అది సాధ్యమా? అన్ని కార్లలో బ్రెతలెజర్స్‌ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్‌కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అనే విషయాన్ని బ్రెతలైజర్స్‌ అనుసంధాన వ్యవస్థ ఎలా తెలుసుకుంటుంది. మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్‌ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు బ్రిటన్‌ అధికారులకు ఎదురవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు అధికారుల దగ్గర లేవు. మరికొన్ని రోజుల్లో అన్నింటికీ పరిష్కారాలు కనుక్కోనున్నట్లు తెలుస్తోంది.