పంజాగుట్ట నుంచి కోఠి వైపు వెళ్తున్న రన్నింగ్ కారులో మంటలు

పంజాగుట్ట నుంచి కోఠి వైపు వెళ్తున్న రన్నింగ్ కారులో మంటలు

పంజాగుట్ట, వెలుగు: నడుస్తున్న కారులో అకస్మత్తుగా మంటలు చెలరేగగా, డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి పంజాగుట్ట నుంచి కోఠి వైపు వెళ్తున్న సెడాన్ టాక్సీ కారు ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. గమనించిన డ్రైవర్, వెంటనే కారును ఆపి ప్రయాణికులను కిందికి దించేశాడు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. ఖైరతాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.