
శంషాబాద్, వెలుగు: రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్‌కు చెందిన హుస్సేన్(31) ఆదివారం మధ్యాహ్నం తన కారులో షాద్‌నగర్ వెళ్తున్నాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి బ్రిడ్జిపైకి చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అతను పక్కకు ఆపి, దిగిపోయాడు. స్థానికులు పోలీసులు, ఫైర్‌సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వచ్చి, మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు వచ్చాక విచారణ జరుపుతామని పేర్కొన్నారు.