హైదరాబాద్ మాదాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలో రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మాదాపుర్ హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్ బీ రూట్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. NIA కార్యాలయం సమీపంలో స్కోడా కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి.
మంటలను గమనించి కారులో నుంచి మహిళ బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు ట్రాఫిక్ పోలీసులు మంటలను అదుపు చేశారు. కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు.
