ఉప్పల్ స్టేడియం దగ్గర కారులో మంటలు

ఉప్పల్ స్టేడియం దగ్గర కారులో మంటలు

హైదరాబాద్  ఉప్పల్ స్టేడియం దగ్గర రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొనడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు బయటకు దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా  కాలిపోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.