కార్లను తాకట్టు పెట్టిన డ్రైవర్ అరెస్ట్

కార్లను తాకట్టు పెట్టిన డ్రైవర్ అరెస్ట్

గోదావరిఖని, వెలుగు:  అద్దె పేరిట కార్లను తీసుకెళ్లి కుదువపెట్టి డబ్బులు తెచ్చుకుని జల్సాలు చేస్తున్న వ్యక్తిని  పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్​తెలిపిన ప్రకారం.. గోదావరిఖనిలోని ఎల్​బి నగర్​కు చెందిన మారపెల్లి ప్రణయ్​భాస్కర్​  కారు డ్రైవర్. కాగా..  కార్లకు అద్దె ఇప్పిస్తానని నమ్మించడంతో ఎల్​బీనగర్​కు చెందిన బోడ తిరుపతి తన కారు  ఇచ్చాడు. కొన్ని నెలలు కిరాయి ఇచ్చి అనంతరం మానేశాడు.  

కారు అద్దె గురించి అడిగితే బెదిరించడంతో తిరుపతి గోదావరిఖని వన్​టౌన్​ పోలీస్​ స్టేషన్​లో గత నెలలో కంప్లయింట్ చేశాడు. వన్​టౌన్​ సీఐ ఇంద్రసేనారెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో నలుగురి కార్లను కూడా తీసుకెళ్లి కుదువపెట్టి  రూ.10 లక్షలు తీసుకున్నట్టు తేలింది. ఇదే కేసుకు సంబంధించిన ఎల్ బీనగర్ కు చెందిన జూపాక పుప్పలత, సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్​కు పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు.  వన్​టౌన్​ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది ఉన్నారు.